Turkey’s Olympic Shooter | పారిస్ ఒలింపిక్స్ ( Paris Olympics ) లో అతనో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఒలింపిక్స్ లో షూటింగ్ ( Shooting ) పోటీ అంటే ఐ కవర్, స్పెషలైస్డ్ లెన్స్, ఇయర్ ప్రొటెక్షన్ వంటివి ధరిస్తారు.
కానీ టర్కీ ( Turkey ) కి చెందిన 51 ఏళ్ల యూసఫ్ డికెక్ ( Yusuf Dikec ) మాత్రం సింపుల్ గా వచ్చి సిల్వర్ మెడల్ ( Silver Medal ) కొట్టారు. ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండానే 51 ఏళ్ల యూసఫ్ ఎయిర్ పిస్టల్ మిక్సడ్ టీం ఈవెంట్ లో పాల్గొన్నారు.
కామ్ గా వచ్చి జోబులో చేతి పెట్టుకొని మరో చేత్తో తుపాకినీ పేల్చాడు. ఈ పోటీల్లో ఆయన సిల్వర్ మెడల్ సాధించాడు.
తొలి సారి 2008లో బీజింగ్ ( Beijing )ఒలింపిక్స్ లో పోటీపడిన యూసఫ్ కి ఇది ఐదవ ఒలింపిక్స్. కానీ మెడల్ గెలవడం మాత్రం ఇదే తొలిసారి. కాగా ఈయన స్టైలిష్ షూటింగ్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.