Wednesday 16th September 2026
12:07:03 PM
Home > క్రైమ్ > జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్య..

జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్య..

Junior artist suicide..

-పుష్ప నటుడు జగదీష్‌ అరెస్టు

పంజాగుట్ట: పుష్ప సినిమాలోఅల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీష్‌ (కేశవ) పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూనియర్ ఆర్టిస్టుమరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన జగదీష్‌ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. జగదీష్‌ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ (జూనియర్ అర్టిస్టు) గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీష్‌ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీష్‌ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీష్‌కు పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions