Tuesday 15th September 2026
12:07:03 PM
Home > క్రైమ్ > ‘ఆ వార్త అవాస్తవం..’ ఐబొమ్మ రవికేసులో కీలక వివరాలు వెల్లడి!

‘ఆ వార్త అవాస్తవం..’ ఐబొమ్మ రవికేసులో కీలక వివరాలు వెల్లడి!

I Bomma Ravi Case Update | ‘సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐ-బొమ్మ (I Bomma)రవి కేసుకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం సీసీఎస్ అడిషినల్ సీపీ శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు.

రవికి బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ద్వారా డబ్బులు వచ్చేవని తెలిపారు. యాడ్ బుల్ కంపెనీ కూడా రవికి చెందినదేనని వెల్లడించారు. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బుల్ని యాడ్ బుల్ కంపెనీకి మళ్లించారని తెలిపారు. తద్వారా ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల వరకు సంపాదించాడని వెల్లడించారు.

ఐబొమ్మ (I Bomma), బప్పం (Bappam) సైట్లను రవి స్నేహితుడు నిఖిల్‌ డిజైన్‌ చేశాడని తెలిపారు. ఐబొమ్మ రవి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తోనే దొరికాడనీ, రవి భార్య సహాయంతో అతడిని పట్టుకున్నామనే వార్తలు అవాస్తవమని వెల్లడించారు. ఇప్పటికీ మరికొన్ని మూవీరూల్జ్‌, తమిళ్‌ఎంవీ లాంటి పైరసీ సైట్లు ఇంకా నడుస్తున్నాయనీ, వాటి నిర్వాహకులను పట్టుకునే పనిలోనే ఉన్నామని చెప్పారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions