Tuesday 21st April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఎగిరే చేప వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్!

ఎగిరే చేప వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్!

flying fish

Flying Fish Video | ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తరచూ ఆసక్తికర అంశాలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో తొలిసారి ఎగిరే చేపను చూశానంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో సముద్రంలో బోటులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రెక్కలున్న చేపను చూపిస్తాడు. దానిని వదిలేసిన వెంటనే అది పక్షిలా ఎగురుతూ సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఈ పోస్టు వైరల్ గా మారడంతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాస్వాన్ స్పందించారు.

అది ఏఐ ద్వారా రూపొందించిన వీడియో కాబట్టి తొలిసారి ఎగిరే చేపను చూడగలిగారని తెలిపారు. దీంతో ఏది ఏఐ వీడియోనో, ఏది ఒరిజినల్ వీడియోనో తెలియడం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

You may also like
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions