Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > సవాల్ ను స్వీకరించిన పోలీస్..ఐ బొమ్మ క్లోజ్

సవాల్ ను స్వీకరించిన పోలీస్..ఐ బొమ్మ క్లోజ్

Tollywood film piracy site iBomma administrator arrested in Hyderabad | పైరసీ వెబ్సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖకు చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే.

ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ వచ్చిన రవిని అదుపులోకి తీసుకున్నారు. కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ లో ఉంటూ రవి ఐ బొమ్మను నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇతడి మూలంగా టాలీవుడ్ కు రూ.22 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు. రవి స్వస్థలం విశాఖపట్నం. తనపై ఫోకస్ చేయొద్దని, దమ్ముంటే తనను పట్టుకోవాలని ఐ బొమ్మ రవి గతంలో పోలీసులకే సవాల్ విసిరిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో సవాల్ ను స్వీకరించిన పోలీసులు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకుని అతడితోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్ సైట్లను మూయించడం విశేషం. వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో వీటిని మూసివేశారు. కూకట్పల్లిలోని రవి ఫ్లాట్ లో రూ.మూడు కోట్ల నగదు, వందలాది హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే ఎథికల్ హ్యాకర్ అయిన రవి ప్రపంచంలోనే ఎంతటి భద్రత ఉన్న సర్వర్ ను అయినా హ్యాక్ చేయడంలో దిట్ట అని తెలుస్తోంది. పైరసీ ద్వారా అతడు రూ.వందల కోట్లను సంపాదించినట్లు తెలుస్తోంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions