Wednesday 16th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > వీరిపై నమ్మకం ఉంచిన SRH

వీరిపై నమ్మకం ఉంచిన SRH

Sunrisers Hyderabad IPL 2026 Retentions | ఐపీఎల్ లో భాగంగా ఫ్రాంఛైజీలు రిలీజ్, రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితాను నవంబర్ 15న బీసీసీఐకి సమర్పించాయి.

ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులో పెద్దగా మార్పులేమి చేయలేదు. గత రెండు సీజన్లలో ప్రత్యర్థి జట్లను బెంభేలెత్తించిన బ్యాటర్లను రిటైన్ చేసుకుంది. గత సీజన్ లో పేలవ ప్రదర్శన కనబరిచిన మహమ్మద్ షమీని హైదరాబాద్ వదులుకునేందుకు సిద్ధం అవ్వగా లక్నో ట్రేడ్ ద్వారా ఎస్ఆర్హెచ్ కు రూ.10 కోట్లు చెల్లించి షమీని దక్కించుకుంది.

పలువురు ప్లేయర్లను రిలీజ్ చేసిన తర్వాత అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్, కమిందు మెండీస్, హర్షల్ పటేల్, పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కట్, జీషన్ అన్సారీ, బ్రైడెన్ కార్స్, హార్ష్ దూబే, సామ్రాన్ రవిచంద్రన్ లను హైదరాబాద్ రిటైన్ చేసుకుంది.

ఇకపోతే అభినవ్ మనోహర్, అథ్వర తైడే, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, సీమర్ జిత్ సింగ్, రాహుల్ చాహార్, ఆడమ్ జంపాను యాజమాన్యం రిలీజ్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ వద్ద రూ.25.50 కోట్లు ఉండగా, 10 మంది ప్లేయర్లకు అవకాశం ఉంది. డిసెంబర్ 15న అబుదాబిలో ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions