Monday 22nd June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆరోజు ఆలయం మూసివేత!

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆరోజు ఆలయం మూసివేత!

ttd

TTD Alert | తిరుమల (Tirumala) వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ (TTD) అలర్ట్ ఇచ్చింది. మార్చి 3న ఒకరోజు పాటు శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఆరోజు చంద్ర గ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది.

మార్చి 3న ఉదయం 9 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సుమారు 10.30 గంటల పాటు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆరోజు చంద్ర గ్రహణం సాయంత్రం 3.20 గం. ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుంది.

అయితే సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. దీంతో ఉదయం 9 గంటలకే ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి గ్రహణం ముగిసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు.

అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుంది. మార్చి 3న కొన్ని ముఖ్య సేవలు, దర్శనాలు రద్దు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాలను గమనించి తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించింది.

You may also like
pawan annamalai
పవనన్నా మీ నిర్ణయం ప్రశంసనీయంఅన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు!
ttd
తిరుమల క్యూ లైన్ లో ఫైట్..స్పందించిన టీటీడీ!
bandla ganesh completes his padayatra to tirumala
23 రోజులు 500 కి.మీ.. ముగిసిన బండ్ల గణేశ్ పాదయాత్ర!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions