Wednesday 20th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం!

తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం!

vijay swearing in ceremony

‌- అవినీతిపై సర్జికల్ స్ట్రైక్..
– లంచం అడిగితే వీడియో తీయండి..
– రూ. 1 లక్ష రివార్డ్ కొట్టేయండి!
తమిళనాడులో నయా రూల్!

CM Vijay Announces Anti Corruption Scheme | తమిళనాడులో ప్రభుత్వ శాఖల్లో అవినీతిని పూర్తిగా అంతమొందించేందుకు నూతన ముఖ్యమంత్రి దళపతి విజయ్ (CM Vijay) సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారు. పాలనలో పారదర్శకతను పెంచడం కోసం ఆయన ప్రతిపాదించిన ఒక సంచలన పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఆ విషయాన్ని రిపోర్ట్ చేసిన సామాన్య పౌరుడికి ఏకంగా రూ. 1 లక్ష నగదు బహుమతి (Reward) ఇవ్వాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సరికొత్త నిర్ణయం తమిళనాడు పరిపాలనా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రూ. 1000 లంచం అడిగినా.. రూ. 1 లక్ష రివార్డ్!
విజయ్ సర్కార్ ప్రతిపాదించిన ఈ సరికొత్త యాంటీ కరప్షన్ ఫ్రేమ్‌వర్క్ నియమ నిబంధనలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారి డిమాండ్ చేసిన లంచం మొత్తం కేవలం రూ. 1,000 అంతకంటే తక్కువగా ఉన్నప్పటికీ.. పౌరులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు.

వీడియో ఆధారం ఉంటే చాలు..
లంచం అడుగుతున్న సమయంలో బాధితుడు లేదా సదరు పౌరుడు దానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను (Video Proof) సాక్ష్యంగా సమర్పిస్తే సరిపోతుంది. ఆ క్లెయిమ్ నిజమని తేలగానే సదరు వ్యక్తికి రూ. 1 లక్ష రివార్డ్ అందుతుంది.

యాంటీ కరప్షన్ విభాగానికి సర్వాధికారాలు..
ఈ పథకాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు అవినీతి నిరోధక విభాగాన్ని (Anti-Corruption Department) పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు.

పూర్తి స్వేచ్ఛ మరియు పవర్స్..
రాజకీయ లేదా లీగల్ ఒత్తిళ్లకు లొంగకుండా, అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఈ విభాగానికి విజయ్ సర్కార్ సర్వాధికారాలు కల్పించింది. సామాన్య ప్రజలు చాలా కాలంగా ఆశిస్తున్న పటిష్టమైన అవినీతి నిరోధక వ్యవస్థను క్షేత్రస్థాయిలోకి తీసుకురావడంలో ఈ నిర్ణయం ఒక గేమ్ ఛేంజర్‌ కానుంది.

తమిళనాడు చరిత్రలోనే అక్రమాలకు తావులేని విధంగా పరిపాలనను నడపాలని కంకణం కట్టుకున్న విజయ్.. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తే, రాష్ట్ర చరిత్రలోనే వన్ ఆఫ్ ది ఆల్‌టైమ్ గ్రేట్ సీఎంలలో ఒకరిగా నిలిచిపోవడం ఖాయమని జనం కొనియాడుతున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions