Wednesday 20th May 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఐపీఎల్ ఆదాయం.. స్టార్లు ఎన్ని రూ.కోట్లు సంపాదించారంటే!

ఐపీఎల్ ఆదాయం.. స్టార్లు ఎన్ని రూ.కోట్లు సంపాదించారంటే!

‌- విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డ్!
– కేకేఆర్ వాల్యూ ఎంతో తెలుసా?
హురూన్ నివేదికలో షాకింగ్ నిజాలు!

IPL Income | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటే కేవలం ఫోర్లు, సిక్సర్ల వినోదం మాత్రమే కాదు.. అది క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించే ఒక కుబేరుల లీగ్ అని మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్ చరిత్రలో ఆటగాళ్ల సంపాదన, ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూపై ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘హురూన్’ (Hurun) మరియు ‘ఫెనాటిక్ స్పోర్ట్స్’ సంయుక్తంగా ఒక సంచలన నివేదికను విడుదల చేశాయి.

ఈ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఆదాయం ఆర్జించిన లీడర్‌గా టీమిండియా రన్ మెషీన్, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించారు.

ఐపీఎల్ టాప్-3 సంపాదనపరులు (ఆల్‌టైమ్ లీగ్ ఆదాయం):

2008 మొదటి సీజన్ నుండి నేటి వరకు ఐపీఎల్ కాంట్రాక్టుల ద్వారా అత్యధికంగా సంపాదించిన టాప్-3 ఇండియన్ స్టార్లు వీరే:

ఆటగాడి పేరుఫ్రాంచైజీ / టీమ్మొత్తం ఐపీఎల్ సంపాదన
1. విరాట్ కోహ్లీరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)రూ. 230 కోట్లు
2. రోహిత్ శర్మముంబై ఇండియన్స్ (MI)రూ. 227 కోట్లు
3. ఎంఎస్ ధోనిచెన్నై సూపర్ కింగ్స్ (CSK)రూ. 200 కోట్లు

మొదటి సీజన్ నుండి ఒకే ఒక్క ఫ్రాంచైజీ (ఆర్సీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ రూ. 230 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ముంబైని ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ రూ. 227 కోట్లతో గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానంలో నిలిచారు. తలా ధోని రూ. 200 కోట్ల మార్కుతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

లక్ష కోట్ల క్లబ్‌లో ఐపీఎల్..
ఆటగాళ్ల జీతాలే కాకుండా.. ఐపీఎల్ ఫ్రాంచైజీల మొత్తం మార్కెట్ విలువను కూడా ఈ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంచైజీల మొత్తం బ్రాండ్ విలువ అక్షరాలా రూ. 1.63 లక్షల కోట్లు గా తేలింది. ఇందులో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన టాప్-3 ఫ్రాంచైజీల వివరాలు ఇలా ఉన్నాయి.

షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కేకేఆర్ అత్యధికంగా రూ. 19,200 కోట్ల విలువతో దేశంలోనే నంబర్ వన్ మోస్ట్ వాల్యుబుల్ ఐపీఎల్ టీమ్‌గా నిలిచింది.ముంబై ఇండియన్స్ (MI): రూ. 18,400 కోట్ల బ్రాండ్ వాల్యూతో రెండో స్థానంలో ఉంది. ముంబైతో సమానంగా రూ. 18,400 కోట్ల మార్కెట్ విలువతో చెన్నై సంయుక్తంగా రేసులో నిలిచింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions