Monday 15th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘పహల్గాం ఉగ్రదాడి..ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్’

‘పహల్గాం ఉగ్రదాడి..ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్’

Putin dials Modi over Pahalgam attack | రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కి కాల్ చేశారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు.

ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు మరణించడంపై పుతిన్ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటానికి పుతిన్ పూర్తి మద్దతు తెలిపారు. ఈ ఘాతుక దాడి చేసినవారు మరియు వారికి మద్దతు ఇచ్చినవారు తప్పకుండా శిక్షించబడాలని ఆయన నొక్కి చెప్పారు.

ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇరు నాయకులు మధ్య ప్రత్యేక మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో 80వ విక్టరీ డే సందర్భంగా పుతిన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ ఏడాది చివరిలో భారతదేశంలో జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయనను ఆహ్వానించారు.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions