Thursday 4th June 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘పెద్ది’ షాట్ రిక్రియేట్..DC పోస్టుపై రాం చరణ్ రియాక్షన్ ఇదే!

‘పెద్ది’ షాట్ రిక్రియేట్..DC పోస్టుపై రాం చరణ్ రియాక్షన్ ఇదే!

Delhi Capitals recreate ‘Peddi’ movie sequence | ఐపీఎల్ లో భాగంగా సోమవారం ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్-ఢిల్లీ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో రాం చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ మూవీ టీజర్ ను డీసీ రిక్రియేట్ చేసింది.

దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ఇటీవలే విడుదలైన ‘పెద్ది’ టీజర్ లో రాంచరణ్ కు సంబంధించిన క్రికెట్ షాట్ విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ సమీర్ రిజ్వీ రాంచరణ్ క్రికెట్ షాట్ ను రిక్రియేట్ చేశారు.

ఈ క్రమంలో డీసీ వీడియోపై గ్లోబల్ స్టార్ రాంచరణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పెద్ది వీడియోను అద్భుతంగా రిక్రియేట్ చేసినందుకు డీసీకి రాంచరణ్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ జరిగే మ్యాచుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే సన్ రైజర్స్ గట్టి కమ్ బ్యాక్ ఇవ్వొచ్చని సిద్ధంగా ఉండాలని సరదాగా పోస్ట్ చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions