Saturday 18th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వీగిపోయిన బిల్లు.. అమిత్ షా హాట్ కామెంట్స్!

వీగిపోయిన బిల్లు.. అమిత్ షా హాట్ కామెంట్స్!

amith shah

Amit Shah Hot Comments | కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళలకు 2029 నుంచి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే బిల్లు లోకసభలో శుక్రవారం జరిగిన ఓటింగ్ లో వీగిపోయిన విషయం తెల్సిందే.

మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ అమలు చేయాలని చూస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు.

‘లోక్‌సభలో చాలా విచిత్రమైన దృశ్యం కనిపించింది. నారీ శక్తి వందన్ అధినియమం కోసం అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే మరియు సమాజ్‌వాదీ పార్టీలు ఆమోదం పొందకుండా అడ్డుకున్నాయి.

మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చే బిల్లును వీగిపోయేటట్లు చేసి, విజయం సాధించినట్లు సంబరాలు చేసుకోవడం, నినాదాలు చేయడం ఊహకు అందని విషయం. ఇకపై దేశ మహిళలకు లోక్‌సభ మరియు విధానసభల్లో వారి హక్కు అయిన 33% రిజర్వేషన్ దక్కదు.

కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు ఇలా చేయడం మొదటిసారి కాదు. వారి ఆలోచన మహిళల హితం కోసం కాదు, దేశం హితం కోసం కూడా కాదు.

విపక్షాలు ‘మహిళల ఆగ్రహాన్ని’ 2029 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే కాకుండా, ప్రతి స్థాయిలో, ప్రతి ఎన్నికలో, ప్రతి చోటా ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని అమిత్ షా హెచ్చరించారు.  

You may also like
BJP Kishan REddy
‘కాంగ్రెస్ వక్రబుద్ధి.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions