Tuesday 29th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > డాకు మహారాజ్ సక్సెస్ డైమండ్ రింగ్..సైఫ్ కు హీరోయిన్ క్షమాపణలు

డాకు మహారాజ్ సక్సెస్ డైమండ్ రింగ్..సైఫ్ కు హీరోయిన్ క్షమాపణలు

Urvashi Rautela apologises to Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ( Saif Ali Khan )కత్తి దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సైఫ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.

అయితే సైఫ్ పై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ నటి ఊర్వశీ రౌతేలా ( Urvashi Rautela ) వజ్రపు ఉంగరాన్ని చూపించడం తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశీని సైఫ్ పై జరిగిన దాడి గురించి ప్రశ్నించారు.

ఈ క్రమంలో ‘సైఫ్ పై జరిగిన దాడి దురదృష్టకరం. కానీ నేను నటించిన డాకు మహారాజ్ ( Daku Maharaj ) మూవీ రూ.150 కోట్లను కలెక్ట్ చేసింది. నాకు మా అమ్మ డైమండ్ ఉంగరాన్ని గిఫ్టుగా ఇచ్చింది. మా నాన్న రోలెక్స్ వాచ్ ని ఇచ్చారు’ అంటూ ఊర్వశీ వ్యాఖ్యానించడం పట్ల నెటిజన్లు ఫైర్ అయ్యారు.

ఈ నేపథ్యంలో నటి ఊర్వశీ తాజగా సైఫ్ అలీఖాన్ కు క్షమాపణలు చెప్పారు. ఇంటర్వ్యూ జరిగే సమయానికి తనకు సైఫ్ పై జరిగిన దాడి తీవ్రత తెలీదన్నారు. అలా మాట్లాడినందుకు తాను సిగ్గు పడుతున్నట్లు సైఫ్ అలీఖాన్ కు ఊర్వశీ క్షమాపణలు కోరారు.

You may also like
‘ఇందిరా గాంధీలా ధైర్యం ఉంటే..ట్రంప్ మాటల్ని ప్రధాని ఖండించాలి’
స్టేడియం పిచ్ క్యూరేటర్-గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం
‘బాధితుల కోసం యాప్..మనం వచ్చాక సినిమా చూపిద్దాం’
‘IND vs PAK మ్యాచ్ చూడడానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేదు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions