Saturday 1st August 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!

కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!

cm revanth reddy

CM Revanth Counter To KCR Speech | బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు.

సోమవారం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన కేసీఆర్ కామెంట్లకు బదులిచ్చారు. నిన్నటి సభలో కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కాడని వ్యాఖ్యానించారు.

“పిల్లగాళ్ళు అని కేసీఆర్ అన్నాడు. మరి వారినేందుకు అసెంబ్లీకి పంపిస్తున్నాడు. కేసీఆర్ స్పీచ్ లో పస లేదు. ఏడాదిన్నర నుంచి అనేక పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు వాటంన్నింటినీ స్ర్టీమ్ లైన్ చేస్తున్నాం. నేను ఇంకా ఇరవై ఏండ్లు రాజకీయాల్లో ఉంటాను.

అరెస్టులు చేయమని డిమాండ్ వస్తోందని అరెస్ట్ చేయలేను. చట్ట ప్రకారమే నడుచుకుంటాను. నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతా. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పాను. ఇప్పించాను. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకపడ్డాం. స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది.

అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నాం” అని తెలిపారు. ఆపరేషన్ కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై తమ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని చెప్పారు.  

You may also like
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions