Sunday 23rd August 2026
12:07:03 PM
Home > తాజా > 37 మున్సిపాలిటీల్లో హాంగ్..ఎక్స్అఫీషియో ఓటుపై ఈసీ క్లారిటీ

37 మున్సిపాలిటీల్లో హాంగ్..ఎక్స్అఫీషియో ఓటుపై ఈసీ క్లారిటీ

SEC Clarity on Voting Rights of Ex-Officio Members | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 50 శాతానికి పైగా స్థానాలను సునాయాసంగా ఖాతాలో వేసుకుంది. 66 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. బీఆరెస్ 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్ లో కాషాయ పార్టీ సత్తా చాటింది. మరోవైపు 37 మున్సిపాలిటీల్లో హాంగ్ ఏర్పడింది. ఈ తరుణంలో ఎక్స్అఫీషియో ఓటు కీలకంగా మారాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎక్స్అఫీషియో ఓటుపై క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలో ఏదో ఒక మున్సిపాలిటీలో మాత్రమే ఎక్స్అఫీషియో ఓటును వినియోగించుకోవచ్చు. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు మాత్రం తమకు ఓటు హక్కు ఉన్న మున్సిపాలిటీల్లో మాత్రమే ఓటును వేయొచ్చు. ఇకపోతే ఎక్స్అఫీషియో ఓటు నమోదుకు నేటి వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions