Sunday 23rd August 2026
12:07:03 PM
Home > తాజా > మున్సిపల్ ఫలితాలు..సీఎం రేవంత్ కు ప్రియాంక అభినందనలు

మున్సిపల్ ఫలితాలు..సీఎం రేవంత్ కు ప్రియాంక అభినందనలు

CM Revanth Reddy Meets Priyanka Gandhi | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అలాగే కార్పోరేషన్లు ఖాతాలో వేసుకుంది. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై ప్రియాంక హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సంతృప్తిగా ఉన్నందున ప్రజలు ఈ ఘన విజయం కట్టబెట్టారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ప్రియాంక గాంధీకి తెలిపారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions