Friday 31st July 2026
12:07:03 PM
Home > క్రైమ్ > అల్లుడిని పెళ్లి చేసుకోబోయిన అత్త..అడ్డుకున్న కూతుర్ని !

అల్లుడిని పెళ్లి చేసుకోబోయిన అత్త..అడ్డుకున్న కూతుర్ని !

Mother Attempts to Marry Her Son-in-Law in Front of Daughter | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం వెలుగు చూసింది. కన్న కూతురి కళ్ళ ముందే అల్లుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యింది తల్లి. అడ్డుకోబోయిన కూతుర్ని రోకలి బండతో దాడి చేయడం కలకలం రేపింది.

సభ్యసమాజం తలదించుకునే పని చేసిన సదరు మహిళపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలో ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల బాలుడు ఐదు నెలల క్రితం 15 ఏళ్ల బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 40 ఏళ్ల బాలిక తల్లి భర్త చనిపోయాడు. ఈ క్రమంలో కుమార్తె, అల్లుడితో కలిసి మహిళ ఒకే ఇంట్లో ఉంటున్నారు.

ఇదే సమయంలో అత్తకు అల్లుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత శుక్రవారం అత్త, అల్లుడు కలిసి ఘోరానికి ఒడిగట్టారు. బాలిక కళ్ళ ముందే పెళ్లి చేసుకోవడానికి యత్నించారు. తల్లి మెడలో భర్త తాళి కడుతుండగా ఆ బాలిక అడ్డుకుంది. దింతో తీవ్ర ఆగ్రహానికి గురైన అత్త, అల్లుడు బాలికపై దాడి చేశాడు. రోకలి బండతో కుమార్తె పై తల్లి దాడి చేసింది. బాలిక కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని అత్త, అల్లుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions