Friday 31st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘నకిలీ మద్యంలో ఏపీ నంబర్ 1..బాబు బ్రాండ్ అంబాసిడర్’

‘నకిలీ మద్యంలో ఏపీ నంబర్ 1..బాబు బ్రాండ్ అంబాసిడర్’

YS Jagan News | మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు నకిలీ లిక్కర్‌ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం జగన్.

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకాని, లిక్కర్‌ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి టీడీపీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కిందివరకూ పంచుకుంటున్నారు ధ్వజమెత్తారు.

లిక్కర్‌ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డురాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని విమర్శించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే.,బెల్టుషాపులు, ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌లు టీడీపీ వాళ్లవే అని అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions