Sunday 6th September 2026
12:07:03 PM
Home > తాజా > భర్త వేధిస్తున్నాడని యువతి ఫోన్..సాయం చేస్తామన్న సీతక్క

భర్త వేధిస్తున్నాడని యువతి ఫోన్..సాయం చేస్తామన్న సీతక్క

Minister Seethakka News Latest | మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమెన్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ ( Women’s Helpline Call Center ) ను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు మంత్రి సీతక్క.

అనంతరం 181 నంబర్ ద్వారా వచ్చిన ఫోన్ కాల్ కు సీతక్క అటెండ్ ( Attend ) చేసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ క్రమంలో తన భర్త వేధిస్తున్నాడని దేవరకొండ నుంచి ఓ యువతి ఫోన్ చేసింది. తనను, తన ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపించారని మంత్రికి సదరు యువతి మొర పెట్టుకున్నారు.

యువతి ఫిర్యాదు పై సీతక్క స్పందించి సహాయం చేస్తామని తెలిపారు. యువతి భర్తకు కౌన్సిలింగ్ ఇస్తామని, వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ తర్వాత స్థానిక సఖీ కేంద్రం అధికారికి ఫోన్ చేసి యువతిని ఆదుకోవాలని ఆదేశించారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions