VC Sajjanar Interview With Naa Anveshana | తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ( TGSRTC ) ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనర్ మరియు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ..తన అనుభవాలను పంచుకుంటారు అన్వేష్. అలాగే బెట్టింగ్ యాప్స్ ( Betting Apps ) పై నెటీజన్లకు అవగాహన కల్పిస్తుంటారు.
మరోవైపు సజ్జనర్ సైతం నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఆర్టీసీ కి సంబంధించిన అప్డేట్స్ ను పంచుకోవడం, సైబర్ నేరాల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటారు. గత కొద్దిరోజులుగా బెట్టింగ్ యాప్స్ పై మరియు వాటిని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ( Influencers ) పట్ల జాగ్రత్త వహించాలని సజ్జనర్ సోషల్ మీడియా ద్వారా కథనాలను, సంఘటనలను షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలో సజ్జనర్, అన్వేష్ కలిసి బెట్టింగ్ యాప్స్ కట్టడిపై ఇంటర్వ్యూలో చర్చించారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, వాటి నియంత్రణపై అన్వేష్ తో చర్చించినట్లు సజ్జనర్ పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రకటనలపై తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించినట్లు సజ్జనర్ తెలిపారు.