Saturday 6th June 2026
12:07:03 PM
Home > తాజా > గ్రూప్-2 ఫలితాలు..టాప్ 31 ర్యాంకుల్లో అబ్బాయిలే

గ్రూప్-2 ఫలితాలు..టాప్ 31 ర్యాంకుల్లో అబ్బాయిలే

Telangana Group-2 Results | తెలంగాణ గ్రూప్-2 పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 783 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో అబ్బాయిలు సత్తా చాటారు.

తొలి 31 ర్యాంకుల్లో అబ్బాయిలే నిలవడం గమనార్హం. గతేడాది నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, డిసెంబర్ 15,16 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఇందులో 13,315 మందిని ఇన్ వ్యాలిడేటెడ్ గా ప్రకటించగా, 2,36,649 మంది అభ్యర్థులతో జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీఎస్సి మంగళవారం విడుదల చేసింది.

జనరల్ ర్యాంకింగ్స్ ఆధారంగా అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేస్తారు. మొత్తం 600 మార్కుల గాను 447.088 మార్కులతో నారు వెంకట హర్ష వర్ధన్ అనే అభ్యర్థి తొలి ర్యాంక్ సాధించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions