Friday 7th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రభుత్వానికి నాలుగు అంబులెన్సులు..సీఎం బాబును కలిసిన సోనూసూద్

ప్రభుత్వానికి నాలుగు అంబులెన్సులు..సీఎం బాబును కలిసిన సోనూసూద్

Actor Sonusood Meets Cm Chandrababu | నటుడు సోనూసూద్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ద్వారా సోనూ సూద్‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లను అందించారు.

ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని నటుడు కలిశారు. అనంతరం అంబులెన్సులను ప్రభుత్వానికి అప్పగించారు. వీటిని సీఎం ప్రారంభించారు.

ఈ క్రమంలో సోనూసూద్ ను చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని… ఈ ఆశయంలో ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు సోనూసూద్ కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions