Jaya Bachchan About Maha Kumbh | రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ సంచలన ఆరోపణలు చేశారు.
సోమవారం పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆమె ఇటీవల కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి మృతదేహాలను నదిలో పారేశారని వ్యాఖ్యానించడం కలకలం రేపుతుంది.
దేశంలో అత్యధికంగా నీరు ఎక్కడైనా కలుషితమైందంటే అది ప్రయాగ్రాజ్ లోనేనని ఎందుకంటే నదిలో శవాలను పడేయడం మూలంగానే అంటూ సమజ్వాదీ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వస్తున్న సామాన్య ప్రజల కోసం యూపీ సర్కార్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, మరోవైపు విఐపీలకు మాత్రం ప్రత్యేక ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
పవిత్ర త్రివేణి సంగమంలో శవాలను పారేయడం మూలంగా నదిలోని నీరు అపవిత్రం అయిందన్నారు. విఐపీలకు కల్పించిన ప్రత్యేక వసతుల మూలంగా బడుగు బలహీన వర్గాలు ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదురుకుంటున్నారని ధ్వజమెత్తారు.
తొక్కిసలాటలో ముప్పై మంది సామాన్య భక్తులు మరణించినా యోగి సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదని జయా బచ్చన్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.