Saturday 1st August 2026
12:07:03 PM
Home > తాజా > వేములవాడలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు!

వేములవాడలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు!

cm revanth visits vemulawada

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా  శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజన్న దర్శనానికి ముందు రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద రూ. 76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి పూజ నిర్వహించారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు సీఎం కు వివరించారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయం లోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు వద్ద అర్చన, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభిషేకం వంటి ప్రత్యేక పూజలను ముఖ్యమంత్రి నిర్వహించారు. పూజల అనంతరం ముఖ్యమంత్రి, మంత్రి వర్యులకు ఆలయ  పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions