Friday 7th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వల్లభనేని వంశీని పరామర్శించనున్న జగన్

వల్లభనేని వంశీని పరామర్శించనున్న జగన్

Ys Jagan To Meet Vallabhaneni Vamshi In Vijayawada Jail | గన్నవరం ( Gannavaram ) మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు వల్లభనేని వంశీని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు.

గన్నవరం టీడీపీ కార్యాలయం ( TDP Office ) పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీకి న్యాయస్థానం రిమాండ్ విధించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

ఈ నేపథ్యంలో జగన్ మంగళవారం ములాఖత్ లో వంశీని కలవనున్నారు. ఈ మేరకు వైసీపీ ( YSRCP ) ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో విజయవాడ గాంధీ నగర్ లోని జిల్లా జైలులో జగన్ వంశీని పరామర్శించనున్నారు.

కాగా అక్రమ కేసులో వంశీని అరెస్ట్ చేశారని కూటమి ప్రభుత్వం పై వైసీపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions