Wednesday 9th September 2026
12:07:03 PM
Home > తాజా > బలవంతపు వసూళ్లపై డీజీపీ సీరియస్.. ‘112’కి డయల్ చేయాలని పిలుపు!

బలవంతపు వసూళ్లపై డీజీపీ సీరియస్.. ‘112’కి డయల్ చేయాలని పిలుపు!

TG DGP CV Anand Warns Extortions తెలంగాణలో హిజ్రాల బలవంతపు డబ్బు వసూళ్లపై ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు.

ఎవరైనా బలవంతంగా డబ్బులు అడిగి వేధింపులకు గురిచేస్తే ప్రజలు భయపడకుండా వెంటనే ‘112’ హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

‘X’ (ట్విట్టర్) వేదికగా ఒక వ్యక్తి తమకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ, సమయానికి స్పందించిన పోలీసులు తమ డబ్బును తిరిగి ఇప్పించారని తెలిపారు.

ఈ పోస్ట్‌కు సమాధానమిచ్చిన డీజీపీ, బాధితులకు తక్షణమే రక్షణ కల్పించేలా పోలీసు రెస్పాన్స్ సిస్టమ్‌ను ఆదేశించామని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలను సహించేది లేదని, ఫిర్యాదు అందిన వెంటనే కఠిన చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు.

You may also like
TG ప్రజలకు అలర్ట్.. అన్నింటికీ ఒకే ఎమర్జెన్సీ నంబర్!
మూవీ స్టైల్‌లో ఆర్టీసీ బస్సు హైజాక్.. పోలీసుల ఛేజింగ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions