Wednesday 15th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘మూవీ పైరసీ చేసేవాడితో పాటు చూసేవాన్ని’

‘మూవీ పైరసీ చేసేవాడితో పాటు చూసేవాన్ని’

RGV About Movie Piracy | మూవీ పైరసీ చేసేవాడితో పాటు చూసేవాళ్ళను శిక్షించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇలా చేస్తేనే పైరసీని అరికట్టవచ్చన్నారు. పైరసీ చేసిన సినిమాను చూసే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నంత వరకు ఐ బొమ్మ రవి లాంటి వారు పుట్టుకొస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ఐ బొమ్మ రవి మద్దతుదారులు అతన్ని గర్వంగా రాబిన్ హుడ్ తో పోల్చుతున్నారని తెలిపిన ఆర్జీవి రాబిన్ హుడ్ హీరో కాదు, ధనవంతులను దోచుకుని, వారిని హత్య చేసి ఆ డబ్బులను పంచే ఓ ఉగ్రవాది అని అన్నారు.

అయితే ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా టికెట్ రేట్లు పెరిగాయని, పాప్ కార్న్ ధర ఎక్కువయ్యిందని ఇతరత్రా కారణాలతో పైరసీ చేయడం న్యాయమే అంటూ సమర్దించుకుంటున్నారని ఆర్జీవి చెప్పారు. ఈ క్రమంలో పైరసీని కట్టడి చేయాలంటే కేవలం ఐ బొమ్మ రవి లాంటి వ్యక్తులను శిక్షిస్తేనే సరిపోదని, వీక్షకులను సైతం పట్టుకుంటేనే అరికట్టవచ్చన్నారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions