Tuesday 15th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > గత 30 ఏళ్లుగా ప్రధాని మోదీకి రాఖీ కడుతున్న పాకిస్తానీ చెల్లెలు!

గత 30 ఏళ్లుగా ప్రధాని మోదీకి రాఖీ కడుతున్న పాకిస్తానీ చెల్లెలు!

PM Modi's Sister

PM Modi’s Pakistani Sister | ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi)కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త మరోసారి వైరల్ అవుతోంది. పాకిస్తాన్ (Pakistan)కు చెందిన ఓ మహిళ గత 30 ఏళ్లుగా భారత ప్రధాని మోదీకి ఏటా రాఖీ కడుతున్నారు.

పాకిస్తాన్ కరాచీకి చెందిన కమర్ షేక్ (Qamar Sheik) అనే మహిళ 1981 లో మోహసీన్ షేక్ అనే వ్యక్తిని వివాహామాడారు. అప్పటి నుండి భారత్ లో నివసిస్తున్నారు. కాగా తొలిసారి 1990 లో అప్పటి గుజరాత్ గవర్నర్ స్వరూప్ సింగ్ ద్వారా నరేంద్ర మోదీకి కమర్ షేక్ పరిచయం అయ్యారు.

ఆమె తన కన్న కూతురు లాంటిది అని కమర్ షేక్ ను మోదీకి పరిచయం చేశారు స్వరూప్ సింగ్. ఈ సందర్భంగా మీకు కూతురు అయితే నాకు కమర్ షేక్ సోదరి అవుతుందని మోదీ బదులిచ్చారు. ఆ తర్వాత నుండి ఏటా రాఖీ పౌర్ణమి సందర్భంగా నరేంద్రమోదీకి కమర్ షేక్ రాఖీ కడుతున్నారు.

ఇప్పటి వరకు వరుసగా 29 ఏళ్ళు ఆమె మోదీతో కలిసి రక్షాబంధన్ ను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా ప్రధానికి రాఖీ  కట్టేందుకు ఆమె సిద్ధం అయ్యారు. అలాగే రాఖీని మార్కెట్ లో కొనుగోలు చేయకుండా ఆమె తన స్వహస్తలతో ఆమె తయారుచేస్తారు.

You may also like
ఇటలీ ప్రధాని మెలోని సరికొత్త రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు!
దేశ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ!
వెడ్ ఇన్ ఇండియా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!
‘ఖేలో ఇండియా డైలాగ్’.. ప్రధాని మోదీ కీలక పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions