PM Modi Instagram Reel World Record | నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో ప్రపంచ స్థాయి రికార్డులను తిరగరాసింది.
ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ఈ వీడియో కేవలం 24 గంటల వ్యవధిలోనే 303 మిలియన్లకు (30 కోట్లకు పైగా) పైగా డిజిటల్ వ్యూస్ సాధించి సోషల్ మీడియా చరిత్రలోనే సరికొత్త సంచలనం సృష్టించింది.
ఐషోస్పీడ్ (IShowSpeed) రికార్డు బ్రేక్..
గతంలో ఫిఫా వరల్డ్ కప్ సందర్భంలో ప్రసిద్ధ అంతర్జాతీయ కంటెంట్ క్రియేటర్ ఐషోస్పీడ్ (IShowSpeed) సాధించిన 300 మిలియన్ వ్యూస్ రికార్డును ప్రధాని మోదీ వీడియో దాటేసింది.
ఈ వైరల్ వీడియో ప్రభావంతో ప్రధాని మోదీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఒక్క రోజులోనే దాదాపు 10 లక్షల (1 Million) మంది కొత్త ఫాలోవర్లు చేరారు. దీంతో ఆయన మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 102 మిలియన్ల మార్కును చేరుకుంది.
ఈ వీడియోలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పేపర్ లీకేజీలను అరికట్టేందుకు త్వరలోనే అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకువస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి రక్షణగా ఉంటుందని హామీ ఇచ్చారు.










