Friday 31st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆటో కొటేషన్లపై నారా లోకేశ్ కామెంట్స్ వైరల్

ఆటో కొటేషన్లపై నారా లోకేశ్ కామెంట్స్ వైరల్

Nara Lokesh News Latest | మంత్రి నారా లోకేశ్ ఆటో కొటేషన్స్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. శనివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆటో వెనుకాల రాసే కొటేషన్స్ చూస్తే డ్రైవర్ల మనసు ఎంటో అర్ధం అవుతుందన్నారు. ఈ సందర్భంగా పలు కొటేషన్లను చదివి వినిపించారు. గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాల వరకు ఆటోలోనే చర్చిస్తారని, ఆటో డ్రైవర్ల ప్రచారం మూలంగా వై నాట్ 175 అన్న వైసీపీ 11 సీట్లకే పరిమితం అయ్యిందన్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, తన మామయ్య బాలకృష్ణ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమతమ సినిమాల్లో డ్రైవర్ పాత్రల్లో కనిపించి అలరించారని పేర్కొన్నారు.

ఆటోలో ఎవరు వస్తువులు మర్చిపోయినా డ్రైవర్ల వాటిని పోలీసులకు అప్పగిస్తారని అభినందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించినట్లు చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రూ.2000 కోట్లతో రాష్ట్రంలోని వివిధ రోడ్లపై గుంతల మరమ్మత్తులు చేపట్టినట్లు తెలిపారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions