Nandigam Suresh Arrested In Hyderabad | బాపట్ల ( Bapatla )మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్ ( Nandigam Suresh ) ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు.
అమరావతి ( Amaravathi ) లోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ను హైదరాబాద్ ( Hyderabad ) లో అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ ( Mangalagiri Police Station ) కు తరలించారు. అమరావతి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైన విషయం తెల్సిందే.
ఇందులో భాగంగా సురేష్ ను అరెస్ట్ చేసేందుకు బుధవారం పోలీసులు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అక్కడ సురేష్ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.
సెల్ ఫోన్ సిగ్నల్ ( CellPhone Signal ) ఆధారంగా సురేష్ హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా టీడీపీ కార్యాలయం దాడి కేసులో ముందస్తు బెయిల్ ( Bail ) మంజూరు చేయాలని సురేష్ దాఖలు చేసిన పిటిషన్ ను హై కోర్టు కొట్టివేసింది.