Monday 21st September 2026
12:07:03 PM
Home > తాజా > Huzurabadలో ఓటమి పై స్పందించిన ఈటల రాజేందర్!

Huzurabadలో ఓటమి పై స్పందించిన ఈటల రాజేందర్!

Eatala Rajendar

Eatela Rajender Tweet | హుజురాబాద్ (Huzurabad)లో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన బీజేపీ నేత ఈటల రాజేందర్ (Eatela Rajendar) ఈసారి మాత్రం ఓటమి పాలయ్యారు.

బీఆరెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) చేతిలో పరాజయం చెందారు. ఈ నేపథ్యంలో తన ఓటమి పై స్పందించారు ఆయన.

” ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. 20 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజలు వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు.. వారి రుణం తీర్చుకోలేనిది. గెలుపొందిన బిజెపి అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు.

ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వినిపించాలని కోరుకుంటున్నాను. అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు.

ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుపుకోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.” అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఈటల.

కాగా గజ్వెల్ లో మాత్రం సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నారు ఈటల.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions