Monday 21st September 2026
12:07:03 PM
Home > తాజా > బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన హరీష్ రావు!

బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన హరీష్ రావు!

Harish Rao

Harish Rao On BRS lost | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress) ఘన విజయం సాధించింది. అధికార బీఆరెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది.

ఈ నేపథ్యంలో ఓటమి పై స్పందించారు హరీష్ రావు (Harish Rao) ” ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు.

రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కు అవకాశమిచ్చిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్ పార్టీ ని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా.

ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు.” అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు హరీశ్ రావు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions