RS Praveen Kumar | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫలితాల పై స్పందించారు బీఎస్పి తెలంగాణ అధ్యక్షులు ఆరేస్ ప్రవీణ్ కుమార్.
” తెలంగాణలో చారిత్రాత్మక విజయం సాధించిన కాంగ్రేసు పార్టీకి, ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు.
బహుజన్ సమాజ్ పార్టీకి ఈ ఫలితాలు నా సిర్పూర్ ఫలితంతో సహా కొంత నిరాశ కలిగించినా చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం.
భవిష్యత్తులో బహుజనవాదాన్ని గడప గడపకు తీసుకొని వెళ్లి, పేదలకు గొంతుకగా ఉండడమే మా అందరి ముందున్న కర్తవ్యం.
మహనీయుల ఆశయాల కోసం రాత్రింబవళ్లు శ్రమించిన బీయస్పీ కార్యకర్తలకు నా డధన్యవాదాలు, మీ కష్టాన్ని వృదా కానివ్వను. ” అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారాయన.











