Monday 22nd June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > TN రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. 35 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ!

TN రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. 35 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ!

tn politics

Twist In TN Politics | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే.. దశాబ్దాల చరిత్ర కలిగిన అన్నాడీఎంకే (AIADMK) పార్టీలో ఊహించని భారీ ‘ముసలం’ మొదలైంది.

ఎన్నికల్లో ఘనవిజయం సాధించి 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) వైపు అన్నాడీఎంకేకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు సిద్ధమైనట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పీక్స్‌ కు చేరాయి.

చెన్నైలోని అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగం కార్యాలయంలో సుమారు 35 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమవ్వడం పొలిటికల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ భేటీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, పార్టీ భవిష్యత్తు మరియు తదుపరి వ్యూహాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అన్నాడీఎంకే తరఫున గెలిచిన మొత్తం 47 మంది ఎమ్మెల్యేలలో 35 మంది ఒకేసారి తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే కనుక పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

ప్రస్తుత ఫలితాల ప్రకారం విజయ్ పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మేజిక్ ఫిగర్‌కు కొద్దిగా దూరంలో ఉన్న తరుణంలో.. అన్నాడీఎంకే నుంచి ఈ స్థాయి వలసలు జరిగితే గనుక తమిళనాట టీవీకే ప్రభుత్వం అత్యంత సుస్థిరంగా మారే అవకాశం ఉంది.

ద్రావిడ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన అన్నాడీఎంకే నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఒక కొత్త పార్టీ వైపు చూడటం తమిళనాడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions