Wednesday 6th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బెంగాల్ సీఎంగా మమత మాజీ శిష్యుడికే ఛాన్స్?

బెంగాల్ సీఎంగా మమత మాజీ శిష్యుడికే ఛాన్స్?

suvendu adhikari

Amit Shah to announce West Bengal CM | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాల తర్వాత ఒక కొత్త అధ్యాయం మొదలుకానుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు తన రాజకీయ గురువైన మమతా బెనర్జీని ఆమె కంచుకోటల్లోనే ఓడించిన సువేందు, ఇప్పుడు బెంగాల్‌ను ఏలబోతున్నారనే వార్తలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

శుక్రవారం ఎల్పీ మీటింగ్..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఎల్లుండి (శుక్రవారం) కోల్‌కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో సువేందు అధికారిని శాసనసభాపక్ష నేతగా (CM అభ్యర్థిగా) ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.

అమిత్ షా అధికారిక ప్రకటన..
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య.. సువేందు అధికారి పేరును ప్రతిపాదించనుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాల సమాచారం.

గతంలో మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి కారణమైన నందిగ్రామ్‌లోనే ఆమెపై గెలిచి సువేందు సంచలనం సృష్టించారు.

తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆమెకు తిరుగులేని కంచుకోటగా భావించే ‘భవానీపూర్’ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించి, పార్టీలో తనను తాను తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు.

ఈ అసాధారణ విజయాలే సువేందు అధికారిని బెంగాల్ ముఖ్యమంత్రి పీఠం వైపు నడిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

You may also like
కోల్కత్త హత్యాచార ఘటన..వైద్యుల నిరసన శిబిరానికి సీఎం మమతా

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions