Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > పరారీ వార్తలను ఖండించిన మోహన్ బాబు.. ఎక్కడున్నారంటే!

పరారీ వార్తలను ఖండించిన మోహన్ బాబు.. ఎక్కడున్నారంటే!

mohan babu warning

Manchu Mohan Babu Tweet | నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) కుటుంబంలో ఇటీవల వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జల్ పల్లి లోని తన నివాసంలో మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. దీంతో మోహన్ బాబుపై కేసు నమోదైంది.

విచారణకు హాజరు కావాలని కూడా పోలీసులు ఆదేశించారు. అయితే మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ రద్దు అయిందని, మోహన్ బాబు పరారీలో ఉన్నాడంటూ శుక్రవారం నుంచి మీడియాలో ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో మోహన్ బాబు మాత్రం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని వాటిని ఖండించారు.తన ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేదనీ.. ప్రస్తుతం తను ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నానని తెలిపారు. వాస్తవాలను మాత్రమే బయటపెట్టాలని మీడియాను కోరుతున్నానని పోస్ట్ చేశారు. 

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions