Saturday 25th April 2026
12:07:03 PM
Home > క్రీడలు > ప్లేయర్ తలకి గాయం.. మైదానంలోకి అంబులెన్స్!

ప్లేయర్ తలకి గాయం.. మైదానంలోకి అంబులెన్స్!

lungi ngidi injured

Lungi Ngidi injured | ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ లూంగి ఎంగిడి ఫీల్డింగ్ చేస్తూ తలకు తీవ్ర గాయమవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో మైదానంలోకి అంబులెన్స్‌ను రప్పించి, ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అసలేం జరిగింది..
ఢిల్లీ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ను అక్షర్ పటేల్ వేశారు. ఈ ఓవర్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన ఒక ఎత్తైన క్యాచ్‌ను అందుకునే క్రమంలో మిడ్-ఆఫ్ నుంచి ఎంగిడి వెనక్కి పరుగెత్తారు.

బంతిని చూస్తూ వెనక్కి పరుగెత్తిన ఎంగిడి అదుపు తప్పి వెల్లకిలా పడిపోయారు. ఆ సమయంలో ఆయన తల వెనుక భాగం నేలకు బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది.

అంబులెన్స్ ఎంట్రీ.. నిలిచిన ఆట..
ఎంగిడి మైదానంలోనే కుప్పకూలడంతో తోటి ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. మెడికల్ టీమ్ వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించింది.

పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌ ను నేరుగా పిచ్ సమీపంలోకి రప్పించారు. ఎంగిడిని స్ట్రెచర్‌పై ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అరుణ్ జైట్లీ స్టేడియం ఒక్కసారిగా నిశబ్దమైపోయింది.

రికార్డుల మోత..
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 (నాటౌట్) పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో ఒక ఇండియన్ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు రికార్డును నెలకొల్పారు. నితీష్ రాణా (91)తో కలిసి ఆయన 220 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions