- ఏం డిమాండ్ చేశారంటే!
CJP Talks With Centre | నీట్ పరీక్ష వివాదంపై కేంద్ర మంత్రులతో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు జరిపిన చర్చలు ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం ముందు సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లను ఉంచగా, అందులోని రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. నీట్ పరీక్ష అవకతవకల వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, నాయకులపై నమోదు చేసిన పోలీసు కేసులను తక్షణమే ఎత్తివేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. కేసుల ఉపసంహరణ సహా ఇతర అంశాలపై స్పందించినప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం సమయం కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని, ఆయన పదవి నుంచి దిగిపోయే వరకు దేశవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. సమస్య పరిష్కారానికి రేపు మరోసారి కేంద్ర మంత్రులతో సీజేపీ నేతల చర్చలు కొనసాగనున్నాయి.











