APJ Abdul Kalam Seva Puraskar 2022 | వందే భారత్ ఫౌండేషన్ (Vandhe Bharat Foundation) ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో అసమాన ప్రతిభ కనబరిచే ప్రముఖులకు ఏటా “డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా పురస్కార్” అవార్డులు అందిస్తున్నారు.
మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా శనివారం (అక్టోబర్ 14) 2022 సంవత్సరానికి గానూ ఈ అవార్డుల కార్యక్రమం ఐఐటీ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ ఏడాది ప్రకటించిన అవార్డుల్లో భాగంగా బిజినెస్ కేటగిరిలో డా. ఏపీజే అబ్దుల్ కలాం సేవా పురస్కార్ (Dr. APJ Abdul Kalam Seva Puraskar) అందుకున్నారు ప్రముఖ యువ ఎంట్రప్రెన్యూర్, కేబీకే గ్రూప్ (KBK Group) అధినేత కక్కిరేణి భరత్ కుమార్.
నాబార్డ్ చైర్మన్ డాక్టర్ జి.ఆర్. చింతల చేతుల మీదుగా భరత్ కుమార్ (Kakkireni Bharath Kumar) ఈ పురస్కారం అందుకున్నారు.
Read Also: కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన రాహుల్ పాదయాత్ర!
చిన్న వయసులోనే బిజినెస్‌లోకి..
విద్యార్థి దశలోనే వ్యాపారంవైపు అడుగులు వేశారు భరత్ కుమార్. గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్న సమయంలోనే చిన్న వయసులో ఐటీ కంపెనీ నెలకొల్పారు.
అనంతరం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసిన భరత్ మరిన్ని కంపెనీలు స్థాపించి దిగ్విజయంగా నడుపుతున్నారు. తనకు తాను అవకాశాలు సృష్టించుకొని ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సోపానాలు నిర్మించుకున్నారు.
కేబీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా నలుగురికీ ఉపాధి కల్పిస్తూ స్వశక్తితో ఎదగాలనుకునే వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Also Read: చిరంజీవికి ఇష్టమైన రాజకీయ నాయకుడెవరో తెలుసా!
కేబీకే హాస్పిటల్‌తో వైద్యరంగంలోకి..
ఇటీవల కాలంలో వైద్య రంగంలోకి కూడా అడుగుపెట్టారు భరత్ కుమార్. కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (KBK Multispecialty Hospital) స్థాపించి, లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నారు.
ఉద్యోగాల కల్పనే కాకుండా అభాగ్యులకు.. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు (orphans) అండగా ఉండేందుకు సంకల్పించారు.
ఈ మేరకు KBK Welfare Association అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
Also Read: Hero Moto Corp ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
కేబీకే హాస్పిటల్ డైరక్టర్ కు కలాం సేవా పురస్కారం..
వందేభారత్ ప్రకటించిన డా. అబ్దుల్ కలాం సేవా పురస్కార్-2022 లిస్టులో కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డి. శ్రీనివాస చారికి చోటు దక్కింది. ఈ ఏడాదిలో వైద్య రంగంలో చేసిన ఆవిష్కరణలకు గానూ ఆయనకు ఈ పురస్కారం లభించింది.
కేబీకే హాస్పిటల్ ప్రత్యేకత ఇదీ..
షుగర్ వ్యాధిగ్రస్తులతోపాటు సాధారణ రోగులనూ దీర్ఘకాలికంగా వేధిస్తున్న గ్యాంగ్రీన్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, స్కిన్ అల్సర్స్, కాలిన గాయాలు, రోడ్డు ప్రమాదాల కారణంగా ఏర్పడ్డ తీవ్రమైన గాయాలు, బోదకాలు పుండ్లు, పాము కాటు గాయలకు ప్రత్యేక చికిత్స అందిస్తోంది కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.
ఆయా గాయాలకు ఆంపుటేషన్ అంటే శస్త్ర చికిత్స ద్వారా అవయవాలు తొలగించాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా నయం చేస్తుంది.