Mano Vignana Yatra | ప్రస్తుత యువతరానికి మానసిక వికాసంతోపాటు ఆర్థిక క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం అని సూచించా కేబీకే గ్రూప్ (KBK Group) అధినేత డా. భరత్ కుమార్ కక్కిరేణి .
ఈ మూడింటిలో నైపుణ్యం సాధిస్తే విజయావకాశాలు కొదవ లేదని పిలుపునిచ్చారు.
శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన మనో విజ్ఞాన యాత్ర ముంగిపు కార్యక్రమంలో ఆయన విశిష్ట అతిథిగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా యువతలో మానసిక వికాసం పెంపొందించడంమే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 రోజుల పాటు యాత్ర చేపట్టిన Mano Vignana Yatra బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
ఏ తరానికైనా ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యమే అసలైన సంపద అని గుర్తు చేశారు.
ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదన్నారు. ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యంమని భరత్ కుమార్ తెలిపారు.
Read Also: గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో టాటా నానో మళ్లీ మార్కెట్ లోకి.. ధర ఎంతంటే!
“మనిషి మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే శారీరకంగా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలుగుతాడన్నారు. మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
ఒత్తిడి కారణంగా ఇటీవల కాలంలో మానసికంగా కుంగిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొన్ని సర్వేల ప్రకారం మానసిక నిపుణులను సంప్రదిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందనే విషయం ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే జీవితంలో ఎదురయ్యే మానసిక అనారోగ్యం, ఒత్తిడి, ఆర్థిక, సాంకేతిక సమస్యలను అధిగమించాలని సూచించారు.
అందుకోసం మనో విజ్ఞాన యాత్రకు నేతత్వం వహించిన సుధీర్ సండ్ర లాంటి మానసిక నిపుణులు అవసరం ప్రస్తుత జనరేషన్ కి చాలా ఉంది” అని ప్రశంసించారు కేబీకే గ్రూప్ అధినేత Bharath Kumar Kakkireni.
పొదుపు కన్నా మదుపు చాలా ముఖ్యం..
మానసిక విజ్ఞానంతోపాటు ప్రస్తుత తరం తప్పనిసరిగా దృష్టి సారించాల్సి విషయాల్లో ముఖ్యమైనవి ఆర్థిక క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అని సూచించారు భరత్ కుమార్.
“చాలా మంది లగ్జరీ లైఫ్ కోసం పరితపిస్తూ చాలా మంది తమ శక్తికన్నా ఎక్కువగా ఖర్చు పెడుతూ భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం విస్మరిస్తున్నారు.
ఆర్థిక క్రమశిక్షణ అంటే కేవలం పొదుపు చేయడం మాత్రమే కాదు. ఆ పొదుపును మదుపు (Invest) చేయడమే ఆర్థిక విజయానికి మొదటి సోపానం.
చిన్నదో పెద్దదో.. నేను సాధించిన ఈ విజయం కూడా ఇన్వెస్ట్ మెంట్స్ ద్వారానే సాధ్యమైంది. 2009 లో ఒక్కడినే ఒక చిన్న ఐటీ కంపెనీ స్థాపించా.
మదుపు సూత్రాల కారణంగానే ఈ 13 ఏళ్లలో ఈ చిన్న ఐటీ కంపెనీ కాస్తా డిజిటల్ మార్కెటింగ్, ఐటీ స్టాఫింగ్, కేబీకే హాస్పిటల్స్, ఈవెంట్స్ ఇలా కేబీకే గ్రూప్ కంపెనీస్ (KBK Group Of Companies)గా ఎదిగేందుకు దోహదపడింది.
కాబట్టి యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ కి నేను చెప్పేది ఒక్కటే పొదుపుతో పాటు మదుపు చాలా ముఖ్యం.
ప్రతి ఒక్కరూ సంపాదించిన దానిలో కనీసం ఒక పది శాతం సంపదను ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టండి.
అప్పుడు అతి తక్కువ సమయంలోనే మీరు ఊహించినదానికంటే ఎక్కువ ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు.”
Also Read: KBK Group CEO భరత్ కుమార్‌కు ‘అబ్దుల్ కలాం సేవా పురస్కార్’ అవార్డు!
టెక్నాలజీతో అప్రమత్తత అవసరం..
“నాణేనానికి మరోవైపు ఉన్నట్లు సాంకేతిక రంగంలోనూ కొన్ని తప్పులు దొర్లుతున్నాయి.
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ ఆధారంగా ఆర్థిక నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కాబట్టి సాంకేతికత వినియోగంలో అప్రమత్తత చాలా అవసరం.
నానాటికీ అప్ డేట్ అవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలి. లేకపోతే సైబర్ నేరగాళ్ల (Cyber Crimes) వలలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. “
మనో విజ్ఞాన యాత్రలో భాగంగా మానసిక వికాసంతోపాటు ఈ ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని (Technical Knowledge) కూడా పంచిన రమేశ్ ఇప్పలపల్లి మరియు నిఖిల్ గుండా లను ప్రత్యేకంగా అభినందించారు.