- అమెరికాలోని ఆస్టిన్ హరిహర క్షేత్రం ఆలయ సందర్శనకు ఆహ్వానం
- గౌ దర్బార్ ఉత్పత్తుల గురించి వివరించిన స్వామి
KBK Group Chairman Bharath Kumar Meets Swamy Paripoornanada | కేబీకే గ్రూప్ (KBK Group) చైర్మన్ డా. కక్కిరేణి భరత్ కుమార్ (Kakkireni Bharath Kumar) ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద (Swami Paripoornananda) తో భేటి అయ్యారు.
గురువారం హైదరాబాద్ చర్లపల్లి (Charlapally)లోని పరిపూర్ణానంద స్వామి నేతృత్వంలోని నిర్వహిస్తున్న గౌ దర్బార్ (Gow Durbar) ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి పరిపూర్ణానంద గౌ దర్బార్ ఉత్పత్తుల తయారీని స్వయంగా చూపించారు.
ఈ కేంద్రం ద్వారా రోజూవారి పూజా సామగ్రి అయిన అగరుబత్తులు, నూనె, నెయ్యి, పసుపు తదితర పూజా సామగ్రి, వంట సామగ్రిని ఎలాంటి కేమికల్స్ ఉపయోగించకుండా పూర్తిగా ఆర్గానిక్ గా తయారు చేస్తున్నట్లు వివరించారు.
భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఈ ఉత్పత్తుల తయారీ ఉంటుందని, ఆ విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా భరత్ కుమార్ అమెరికాలోని ఆస్టిన్ హరహర క్షేత్రానికి రావాల్సిందిగా పరిపూర్ణానందను మరోసారి ఆహ్వానించారు.
ఆయనకు ఆహ్వానానికి స్వామి కూడా సానుకూలంగా స్పందించారు. అతి త్వరలో హరిహర క్షేత్రాన్ని సందర్శిస్తానని చెప్పారు. గౌ దర్బార్ ఉత్పత్తులను హరిహర క్షేత్రంలో కూడా వినియోగిస్తామని భరత్ కుమార్ తెలిపారు. ఈ భేటిలో గౌ దర్బార్ ప్రతినిధి రత్నాకర్, కేబీకే గ్రూప్ ప్రతినిధి ప్రమోద్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.