Sunday 26th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నీట్ వివాదం వేళ బిగ్ ట్విస్ట్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!

నీట్ వివాదం వేళ బిగ్ ట్విస్ట్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!

Dharmendra Pradhan Resigns | దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

గత 36 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) మరియు విద్యార్థి సంఘాలు చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు.

విద్యార్థుల నిరసనలకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో, నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

సీజేపీ ప్రధాన డిమాండ్ నెరవేరింది..

జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఉద్యమంలో సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచిన సంగతి తెలిసిందే.

పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తప్పుకోవాలి.

నష్టపోయిన/బాధిత విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.

ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల రద్దు.

ఇప్పటికే కేసుల ఉపసంహరణ, పరిహారం అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ, మంత్రి రాజీనామాపైనే పట్టు కొనసాగింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపడంతో సీజేపీ తన ప్రధాన డిమాండ్‌ను సాధించుకున్నట్లయ్యింది.

విరమణ దిశగా 36 రోజుల ఆందోళన?

కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల మూడో విడత చర్చలు జరగాల్సి ఉన్న సమయానికే ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

ప్రధాన డిమాండ్‌ అయిన విద్యాశాఖ మంత్రి రాజీనామా నెరవేరడంతో, సీజేపీ తమ సుదీర్ఘ నిరసన ఆందోళనలను విరమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions