Saturday 25th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘పాంచజన్యం’.. కవిత ప్రకటించిన ఐదు హామీలు ఇవే!

‘పాంచజన్యం’.. కవిత ప్రకటించిన ఐదు హామీలు ఇవే!

kavitha five promises

Kavitha Announce Five Promises | తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (Telangana Rashtra Sena-TRS) తన అజెండాను స్పష్టం చేసింది. శనివారం జరిగిన ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత ‘పాంచజన్యం’ పేరుతో తన వాగ్దానాలను ప్రకటించారు.

కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, రాబోయే రెండేళ్లలో అధికారమే లక్ష్యంగా ఆమె ప్రజలకు ఐదు కీలక హామీలు ఇచ్చారు.

కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య. ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం. రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత. యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు. అన్ని కులాలకు, వర్గాలకు సమాన వాటా.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన ప్రతి అమరవీరుడి కుటుంబానికి తాము అధికారంలోకి రాగానే రూ. కోటి ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

“నేను మీ అమ్మను.. తల్లి ఎప్పుడూ జేబు చూడదు, బిడ్డ కడుపు చూస్తుంది. రెండేళ్ల తర్వాత వచ్చేది ‘మీ అమ్మ ప్రభుత్వమే'” అని సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు.

గతంలో కేవలం ఉపఎన్నికల ప్రయోజనం కోసమే దళితబంధు పథకాన్ని వాడుకున్నారని, తాము అధికారంలోకి వస్తే నిజమైన సామాజిక న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని తెలిపారు.

You may also like
trs party
టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ‘షాహీ’ విందు.. అతిథులకు 34 రకాల వంటకాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions