Tuesday 15th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పోలీసులను బెదిరిస్తే కఠిన చర్యలు

పోలీసులను బెదిరిస్తే కఠిన చర్యలు

Deputy Cm Pawan Kalyan On Police | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఈ మేరకు గుంటూరు అరణ్యభవన్ లో జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. అధికారులకి ఎలాంటి అపాయం జరిగినా బెదిరించిన వారిదే బాధ్యత అని స్పష్టం చేశారు.

ఐపీఎస్ అధికారులు లక్ష్యంగా గత ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇంకోసారి ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే సమోటోగా కేసులు ఉంటాయని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి పర్యటనల్లో చెట్ల నరికివేతపై వాల్టా చట్టం కింద చర్యలు తీసుకోనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions