Friday 31st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘కేసీఆర్ ను గెలిపించాలని జగన్ నాటకం ఆడారు’

‘కేసీఆర్ ను గెలిపించాలని జగన్ నాటకం ఆడారు’

cpi narayana
  • ఏపీ సీఎంపై సీపీఐ నారాయణ ఆరోపణలు!

CPI Narayana Comments On Jagan | నాగార్జున సాగర్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నేత నారాయణ.

శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారాయన. ఆంధ్రా కు నీళ్లు అవసరం కానీ తెలంగాణ ఎన్నికల రోజే ఏపీ కి నీటిని విడుదల చేయడం వెనుక సీఎం జగన్ కుట్ర ఉందని ఆరోపించారు.

నాగార్జున సాగర్ వద్ద టెన్షన్ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా సానుభూతి కల్పించి కేసీఆర్ (KCR) ను గెలిపించడానికి సీఎం జగన్ నాటకం ఆడారని విమర్శలు గుప్పించారు నారాయణ.

ఇన్ని రోజులు ఆంధ్రా ప్రయోజనాలను విస్మరించిన జగన్ కు ఎన్నికల రోజే నీళ్లు ఎందుకు గుర్తుకు వచ్చాయని ప్రశ్నించారు.

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ను గెలిపించడం కోసం ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టబోతున్నాయని పేర్కొన్నారు.

అలాగే కాంగ్రెస్ సీపీఐ పొత్తు తెలంగాణ ఎన్నికల్లో విజయం సాదించబోతుందని ధీమా వ్యక్తపరిచారు. అలాగే కొత్తగూడెం లో సీపీఐ అభ్యర్థి నెగ్గబోతున్నారని చెప్పారు సీపీఐ నారాయణ (CPI Narayana).

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions