Monday 9th December 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ”చంద్రబాబు కుల సంఘాలు కాంగ్రెస్ కు మద్దతిచ్చాయి” : మంత్రి అంబటి

”చంద్రబాబు కుల సంఘాలు కాంగ్రెస్ కు మద్దతిచ్చాయి” : మంత్రి అంబటి

Ambati Rambabu On Nagarjuna Sagar Dam|

సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ( AP ) నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ). రెండు రోజులుగా నాగార్జున సాగర్ డ్యామ్ ( Nagarjuna Sagar Dam ) వద్ద నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ ( Ycp ) కార్యాలయంలో మీడియా ( Media ) సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ పై ఏపీ దండయాత్ర చేసిందని వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. సాగర్ డ్యామ్ వద్ద ఏపీ చేపట్టిన చర్యలు న్యాయమైనవి, ధర్మమైనవనీ అని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం శ్రీశైలం( Srisailam ), నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయన్నారు. సాగర్ డ్యాం లో సగ భాగం మాత్రమే తెలంగాణ ( Telangana ) పరిధిలో ఉందని, కానీ చంద్రబాబు ( Chandrababu ) హయాంలో సాగర్ ను తెలంగాణ ఆక్రమించిందని విమర్శించారు.

Read More: ‘తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని కోరుకున్న’

ఈ వ్యవహారం పై రాజకీయ రంగు పులమడం సరికాదని, తెలంగాణ లో ఏ ఒక్క పార్టీ ( Party )కి ఓడించాల్సిన అవసరం వైసీపీ కి లేదని చెప్పారు అంబటి.

Ambati On Telangana Politics|

కానీ చంద్రబాబు కుల సంఘాలు కాంగ్రెస్ ( Congress ) కు మద్దతు ఇచ్చాయని ఆరోపించారు. ఎన్నికల సభల్లో కాంగ్రెస్ జెండాలతో సమానంగా టీడీపీ జెండాలు కనిపించాయని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) పార్టీ అభ్యర్థులను ఓడించటానికి చంద్రబాబు కులం వారు భారీగా డబ్బు ఖర్చు చేసారని సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.

You may also like
vijay sai reddy
‘పవన్ ను దెబ్బతీయడమే చంద్రబాబు లక్ష్యం’ : విజయసాయి రెడ్డి
చంద్రబాబు గారు..రైతులను రోడ్డున పడేశావ్ : జగన్
సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ భేటీ
చాలా పెద్ద తప్పు చేశావ్ తమ్ముడు..ఐ మిస్ యూ : నారా లోకేష్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions