Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > డిసెంబర్ 4న సీఎం కేసీఆర్అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం…!

డిసెంబర్ 4న సీఎం కేసీఆర్అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం…!

kcr news

KCR Decides Cabinet Meet On Dec 4|

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Assembly Elections ) ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. కాగా ఇప్పటికే వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ( Exit Polls ) ఫలితాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి.

అయితే తెలంగాణ ( Telangana ) లో ఏ పార్టీ గెలవబోతుందనేది డిసెంబర్ 3న తెలియనుంది. ఈ నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు బీఆరెస్ ( Brs ) అధినేత కేసీఆర్ ( Kcr ).

డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటలకు.. డా. బి.ఆర్. అంబేద్కర్ ( Dr. BR. Ambedkar ) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ( Cabinet ) సమావేశం జరగనున్నది.

ఫలితాలు వెలువడిన మరునాడే క్యాబినెట్ భేటీ జరగనుండడంతో సర్వత్రా ఉత్కంఠగా మారింది. అంతేకాకుండా ఎన్నికల ఫలితాల పై కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకొనవసరం లేదని, డిసెంబర్ 3 నాడు సంబరాలకు సిద్ధంగా ఉండాలని తనను కలిసిన నేతలకు కేసీఆర్ చెబినట్లు సమాచారం.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions