Sunday 20th April 2025
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ పై ఆరెస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం రేవంత్ పై ఆరెస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు!

rs praveen kumar

RS Praveen Slams CM Revanth | రాష్ట్ర సచివాలయం (TG Secretariate) ఎదుట మాజీ సీఎం కేసీఆర్ (KCR) విగ్రహాన్ని పెట్టాలని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పదునైన భాషను వినియోగించి బీఆరెస్ ను ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో స్పందించారు బీఆరెస్ నాయకులు ఆరెస్ ప్రవీణ్ కుమార్.

“ఎర్రగడ్డ మానసిక రోగ చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి  రాష్ట్ర సచివాలయం ఆరవ అంతస్తుకు అమాంతంగా వస్తే …

మెదడు తికమకపడతది..

ఆలోచనలు తారుమారైతవి..

మాటలు వికృతమైతవి..

తరతరాలు నాశనమైతవి..

తెలంగాణ అధోపాతాళమైతది..

తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి వికృత పదకోశం నుండి జాలువారుతున్న ఆణిముత్యాలను చూసి తన్మయత్వంలో మునిగి వేదిక పైన కూర్చుని నవ్వుతున్న కాంగ్రెస్ నాయకులను చూస్తే జాలేస్తున్నది…

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకుల కొమ్ముకాసిన నేటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆ తల్లి ఒప్పుకుంటదా? ఓ దుష్ట కాంగీయులారా, తెలంగాణ తల్లి మౌనంగా రోదిస్తున్నది. అమర వీరుల ఆత్మలు క్షోభిస్తున్నవి.” అని ఆరెస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
smitha sabharwal
‘వాళ్లందరికీ నోటీసులు పంపారా..’ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్!
‘MMTS అత్యాచారయత్నం కేసు..యువతి మాటలకు షాకయిన పోలీసులు’
nithin
‘అక్కడ 3 రోజులు ఉంటే జబ్బులు ఖాయం’
indiramma indlu
ఇందిరమ్మ ఇండ్లపై తొలి అడుగు.. ఖాతాల్లో రూ. లక్ష జమ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions