Amit Shah on Delimitation seats increase | నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే భయాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొట్టిపారేశారు.
లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. పునర్విభజన తర్వాత దక్షిణాది రాష్ట్రాల సీట్లు పెరగడమే కాకుండా, పార్లమెంట్‌లో వాటి వాటా కూడా మెరుగుపడుతుందని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఇలా..
అమిత్ షా వెల్లడించిన అంచనాల ప్రకారం తెలంగాణలో లోక్ సభ స్థానాలు ప్రస్తుతం ఉన్న 17 స్థానాల నుండి 26 స్థానాలకు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాల నుండి 38 స్థానాలకు పెరుగుతాయి.
దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల (తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక) ప్రాతినిధ్యం గురించి ఆయన కీలక గణాంకాలను సభ ముందుంచారు. ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాల్లో దక్షిణాది వాటా 129 అంటే 23.76% శాతం. పునర్విభజన తర్వాత లోక్‌సభ సీట్లు 816కి పెరిగితే, దక్షిణాది సీట్లు 195కి పెరుగుతాయి. దీనివల్ల వాటా 23.90% కి చేరుతుంది.
దీని అర్థం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదు సదా, స్వల్పంగా మెరుగుపడుతుందని అమిత్ షా వివరించారు.
జనాభా నియంత్రణ పాటించినందుకు తమకు శిక్ష వేస్తున్నారని విమర్శిస్తున్న విపక్ష ముఖ్యమంత్రులకు అమిత్ షా ఈ గణాంకాలతో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. దామాషా ప్రకారం ఎలాంటి మార్పు ఉండదని, భయపడాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.








